ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

ఠాగూర్
సోమవారం, 21 జులై 2025 (15:29 IST)
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంకు తెలుగు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ పదవి ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హరిహర వీరమల్లు ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని సోమవారం చిత్రం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది.  
 
ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సగటు భారతీయుడు మొగల్ కాలంలో అనుభవించిన బాధను ఈ సినిమాలో క్యాప్చర్ చేసినట్టు చెప్పారు. తర్వాత సినిమాలు చేస్తానో లేదో తనకు తెలియదన్నారు. నిర్మాత రత్నంగారి కోసమే బెస్ట్ ఇచ్చానని, ముఖ్యమంత్రికి కూడా రత్నం గారిని ఫిలిం డెవలెప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా ప్రతిపాదించినట్టు తెలిపారు.
 
రత్నం వంటివారు ఇండస్ట్రీ‌కి ఎంతో అవసరమన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు మంచి జరగాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. రత్నం ఆ పదవిని పొందుతారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఎందుకుంటే అన్నీ నా చేతుల్లో ఉండవని, కేవలం ప్రతిపాదన మాత్రమే చేయగలనని చెప్పారు. 
 
తాను వచ్చిన కొత్తల్లో జ్యోతిచిత్ర, సితార ముఖ పేజీలో తన ఫోటోలు వేసేవారు కాదు.. సేలబుల్ కాదనేవారని గుర్తుచేశారు. అలా నాకు తొలి నుంచి సినిమాల ప్రమోషన్ లేకుండానే రిలీజ్ అయ్యాయని, తనకు తన సినిమా కథ ప్రభావం చూపాలి. అలాంటి ఎనర్జీ ఈ సినిమా ఇస్తుందని నమ్ముతున్నట్టు పవన్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments