జక్కన్న అంటే ఇష్టం.. ఆయన డైరెక్షన్‌లో నటించాలని లేదు.. చిరంజీవి

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (10:04 IST)
మెగాస్టార్ చిరంజీవి రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అంటూ గతంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. రాజమౌళి ఇప్పటికే పలువురు హీరోలతో సినిమాలను తెరకెక్కించినా సీనియర్ హీరోలతో సినిమాలను తెరకెక్కించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
స్టార్ డైరెక్టర్ రాజమౌళి అంటే నాకు చాలా ఇష్టమని చిరంజీవి తెలిపారు. జక్కన్న అంటే ఇష్టం ఉన్నా ఆయన డైరెక్షన్‌లో నటించాలని లేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. రాజమౌళి గ్రేట్ డైరెక్టర్ అని ప్రపంచానికి భారతీయ సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని తెలిపారని చిరంజీవి అన్నారు. 
 
జక్కన్న ప్రతి విషయాన్ని లోతుగా చూస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు. రాజమౌళి కోరుకునే ఔట్ పుట్‌ను నటుడిగా నేను ఇస్తానో లేదో చెప్పలేనని ఆయన కామెంట్లు చేశారు.
 
రాజమౌళి ఒక్కో సినిమాను తెరకెక్కించడానికి మూడు నుంచి ఐదేళ్ల పాటు శ్రమిస్తారని నేను ప్రస్తుతం ఒకే సమయంలో నాలుగు సినిమాలలో నటిస్తున్నానని రాజమౌళి డైరెక్షన్‌లో నటించి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని నాకు లేదని ఆయన కామెంట్లు చేశారు. 
 
నా టాలెంట్‌కు నా కొడుకు రామ్ చరణ్ కొనసాగింపు అని చిరంజీవి వెల్లడించడం గమనార్హం. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments