Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అల్లుడు అదుర్స్" పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం : వివి వినాయక్ - నాని

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (12:54 IST)
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభానటేష్, అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్‌గా రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో గొర్రెల సుబ్రమణ్యం నిర్మించిన చిత్రం "అల్లుడు అదుర్స్". ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం జనవరి 15న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. 
 
కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్,   దర్శకుడు సంతోష్ శ్రీనివాస్, సప్తగిరి, ఎడిటర్ తమ్మిరాజు, సమర్పకుడు రమేష్ కుమార్ గంజి, బెల్లంకొండ సురేష్, చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన వినాయక్, నాని "అల్లుడు అదుర్స్" ట్రైలర్ లాంఛ్ చేశారు.
 
సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. 'సాయిని 'అల్లుడు శ్రీను'తో లాంఛ్ చేశాం. ఆ చిత్రంలో సాంగ్స్, ఫైట్స్ ఎంత బాగా చేశాడో ఇప్పుడు "అల్లుడు అదుర్స్"లో కూడా సాయి అద్భుతంగా చేశాడు. దేవిశ్రీప్రసాద్ ఎనర్జీ సాంగ్స్ ఇచ్చాడు. రాజమండ్రి నుండి సినిమా మీద ప్యాషన్తో వచ్చిన నా మిత్రుడు సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రమేష్ కుమార్ కూడా మంచి ఫ్రెండ్ . వాళ్లిద్దరూ కలిసి చేసిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి పనిచేసిన అందరికీ  మంచి పేరు, నిర్మాతలకు మరిన్ని డబ్బులు రావాలి. మా సాయికి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అన్నారు. 
 
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, నా కెరీయర్ బిగినింగ్‌లో బెల్లంకొండ సురేష్‌తో రైడ్ సినిమా చేశాను.. ఆ చిత్రం ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలుసు. అప్పుడు సాయిని చూశాను. ఆఫీసులో డాన్సులు, ఫైట్స్ ప్రాక్టీసు చేసేవాడు. అల్లుడు శ్రీనుతో సాలిడ్‌గా కెరీయర్ ప్లాన్ చేసుకొని మంచి సినిమాలు చేస్తున్నాడు. త్వరలో హిందీలో కూడా సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు "అల్లుడు అదుర్స్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను థియేటర్‌కి తీసుకుని రావడంలో అల్లుడు అదుర్స్ సాయి మెయిన్‌కీ రోల్ పోషించాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు, నిర్మాతలకు ఎక్కువ డబ్బులు రావాలి అన్నారు.
 
చిత్ర నిర్మాత గొర్రెల సుబ్రమణ్యం మాట్లాడుతూ, "ఫస్ట్ ఈ ప్రాజెక్టు‌ని ఇంత బాగా డిజైన్ చేసిన బెల్లంకొండ సురేష్‌కి జీవితాంతం ఋణపడి ఉంటాను. రాక్షసుడు సినిమాకి ముందు సాయి‌తో సినిమా చేసుకో అని మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకొని గొప్పగా సినిమా చేసి ఇచ్చారు. నేను ఊహించిన దానికంటే అల్లుడు అదుర్స్ అద్భుతంగా వచ్చింది. మా హీరో సాయి డాన్సులు, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ సూపర్‌గా చేశారు. సాయికి కూడా లైఫ్ లాంగ్ ఋణపడి ఉంటాను. సంతోష్ శ్రీనివాస్ ఒక మంచి ప్రాజెక్ట్ ద్వారా నన్ను నిర్మాతగా ఇండస్ట్రీలో పరిచయంచేస్తున్నారు. చోటా కె.నాయుడు ఫెంటాస్టిక్ విజువల్స్‌తో అద్దంలా సినిమాని తీర్చిదిద్దారు. అలాగే దేవిశ్రీప్రసాద్ మంచి సాంగ్స్‌తో పాటు, ఆర్.ఆర్ కూడా చాలా బాగా చేశారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. జనవరి 15న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నాం.. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్ చెయ్యాలని అన్నారు. 
 
చిత్ర సమర్పకుడు రమేష్ కుమార్ గంజి మాట్లాడుతూ, మంచి కథాబలం ఉన్న సినిమాలో నేను కూడా ఒక బాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. సంతోష్ శ్రీనివాస్ దమ్మున్న సినిమా చేశాడు. సినిమా చూశాను.. నాకు బాగా నచ్చింది. ఫైట్స్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్ సూపర్బ్‌గా ఉంది. సంక్రాంతికి విన్నర్ అయ్యే సినిమాలలో మా చిత్రం గ్యారెంటీగా సూపర్ హిట్ సాధిస్తుంది.. మా హీరో సాయి కెరీయర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.. ఈ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేష్ గారికి నా థాంక్స్ అన్నారు. 
 
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ రౌతు మాట్లాడుతూ, 'ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్‌తో వస్తోన్న ఈ చిత్రం ఆడియెన్స్ చేత అల్లుడు అదుర్స్ అనిపిస్తుంది. ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. చాలా రోజుల తర్వాత ఒక కలర్ ఫుల్ సినిమా సంక్రాంతి పండక్కి వస్తున్న పర్ఫెక్ట్ యాప్ట్ ఫిల్మ్ ఇది. కంటెంట్ నమ్మి కాంప్రమైజ్ కాకుండా సుబ్రమణ్యం చాలా గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ మూడు కమర్షియల్ సాంగ్స్, రెండు మెలోడీ సుపర్బ్‌గా ఇచ్చారు. ఈ సినిమా చూశాక ఫామిలీ ఆడియెన్స్ అందరూ మా అల్లుడు అదుర్స్ అంటారు. 
 
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, 'హీరో, హీరోయిన్స్ తో పాటు మా యూనిట్ అంతా కాశ్మీర్‌లో వున్నారు. అక్కడ లాస్ట్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. నా మొదటి సినిమా సాంబయ్య నుండి ఇప్పటివరకూ నిర్మాతగా నన్ను అందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. మా అబ్బాయి సాయిని కూడా ఆదరించి ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా నిర్మించిన సుబ్రమణ్యం, రమేష్ కుమార్‌లను కూడా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చెయ్యాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, చోటా కె.నాయుడు విజువల్స్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, స్టన్ శివ ఫైట్స్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి. డెఫినెట్ గా ఈ సినిమా ప్రేక్షకులుచేత  అల్లుడు అదుర్స్ అనిపిస్తాడు. ఇక కందిరీగ వాసుని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రభస చేశాను. రెవిన్యూ పరంగా ఆ చిత్రం మంచి పేరు తెచ్చింది. హైపర్ కూడా బాగానే ఆడింది. 
 
ఈ సినిమాతో సంతోష్ శ్రీనివాస్ టాప్ టెన్ డైరెక్టర్స్ లిస్టులో చేరతాడు. ఇక నుండి కందిరీగ వాసు అనేదిపోయి అల్లుడు వాసు అని పిలుస్తారు. అంత గొప్పగా ఈ సినిమాని తెరకెక్కించిన వాసుకి హాట్సాప్. కచ్చితంగా వాసుకి ఈ సినిమా మంచిపేరు తెస్తుంది. సుబ్రమణ్యం సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చారు. చాలా డేరింగ్ ఉన్న ప్రొడ్యూసర్. ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని చాలా భారీగా నిర్మించిన ఆయన గట్స్ కి హ్యాట్సాప్. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎక్కువ రేట్స్ కి అడిగినా కూడా  సినిమా మీద నమ్మకంతో ఈస్ట్ వెస్ట్ లలో ఓన్ గా రిలీజ్ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో ఆయన గోల్డెన్ నిర్మాతగా పేరు తెచ్చుకుంటాడు. సుమంత్ మూవీ ప్రొడ్యూక్షన్ నా సొంత బ్యానర్ లాంటిది.  ప్రతి సంవత్సరం మా అబ్బాయితో ఈ బ్యానర్లో  సినిమా ఒకటి చేస్తాం అని.. అన్నారు.
 
సప్తగిరి మాట్లాడుతూ, 'కందిరీగ సినిమాలో ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్‌కి నా థాంక్స్. ఆ సినిమా హిట్‍తో నా కెరీయర్ ఇక్కడి దాకా వచ్చింది. ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అల్లుడు అదుర్స్ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments