అవును.. అల్లూ వారబ్బాయి లావణ్య త్రిపాఠి మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. నిజమా అని అడుగుతున్నారు కదూ... అయితే మీరు పప్పులో కాలిసినట్టే. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ పతాకంపై శతమానం భవతి అనే సిని
అవును.. అల్లూ వారబ్బాయి లావణ్య త్రిపాఠి మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. నిజమా అని అడుగుతున్నారు కదూ... అయితే మీరు పప్పులో కాలిసినట్టే. లావణ్య త్రిపాఠి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ పతాకంపై శతమానం భవతి అనే సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజైంది. ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని.. ఈ సినిమాలో అల్లు శిరీష్ తన బంధువుల సమక్షంలో లావణ్య మెడలో మూడు ముళ్ళు వేస్తాడట. అంటే లావణ్య, శిరీష్‌లపై పెళ్ళి సీను ఉంటుంది.
కాగా అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన లావణ్య త్రిపాఠి, భలే భలే మగాడివోయ్, అక్కినేని నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాల్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చిన లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం ఫట్ అయినా లావణ్యకు మంచి పేరు సంపాదించిపెట్టింది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్‌తో శతమానం భవతి సినిమా ద్వారా లావణ్య త్రిపాఠి హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.