Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌తో నటించిన లావ‌ణ్య త్రిపాఠి, అల్లు శిరీష్ తో నటిస్తోంది... శ్రీర‌స్తు-శుభ‌మ‌స్తు

సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటించిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు జూనియర్ నటుడు అల్లు శిరీష్‌తో నటిస్తోంది. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, అల్లు అర‌వింద్ నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (19:01 IST)
సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటించిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు జూనియర్ నటుడు అల్లు శిరీష్‌తో నటిస్తోంది. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌(బుజ్జి) ద‌ర్శ‌కుడిగా, అల్లు అర‌వింద్ నిర్మాత‌గా, ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్లో నిర్మిస్తున్న చిత్రం 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు‌. ఈ చిత్రానికి సంబంధించి చివ‌రి షెడ్యూల్‌ని మోస్ట్ బ్యూటిఫుల్ విజువ‌ల్స్‌లో చిత్రీకరిస్తున్నారు. దీంతో చిత్ర షూటింగ్ పూర్త‌వుతుంది. అతిత్వ‌ర‌లోనే థ‌మ‌న్.S.S సంగీతం అందించిన ఆడియో విడుద‌ల చేసి, త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత స‌న్నాహ‌లు చేస్తున్నారు.
 
ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్(బుజ్జి) మాట్లాడుతూ " అల్లు శిరీష్‌తో నా ట్రావెలింగ్ చాలా బావుంది. చాలా మంచి స్నేహితుడు. త‌న‌కి ఫ్యామిలి అంటే చాలా ఇష్టం. జాయింట్ ఫ్యామిలి వుండాలి. అంతా క‌ల‌సి తీసుకునే నిర్ణ‌యాలు నిల‌బ‌డ‌తాయ‌నే న‌మ్మే వ్య‌క్తి. త‌న వ్య‌క్త‌త్వం గొప్ప‌ది. అదే మా సినిమా. ఫ్యామిలి ఎమోష‌న్స్‌కి విల‌వ‌లు ఇవ్వ‌టం మానేసారు ప్ర‌స్తుత యువ‌త‌, ఫ్యామిలి అంటే ప‌క్కింటి వాడి మేట‌ర్ కాదు మ‌న‌ది మ‌న ఫ్యామిలి, మ‌న అనుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌నైనా సింపుల్‌గా సాల్వ్ చేయ‌చ్చు. ప్ర‌తి ఫ్యామిలీలో అతి ముఖ్య‌మైన ఘ‌ట్టం పెళ్ళి. పెళ్ళి తరువాత అబ్బాయి కాని, అమ్మాయి కాని ఎంత రెస్పాన్సిబుల్‌‍గా వుండాలో ప‌క్క‌న ఫ్యామిలి వుంటేనే తెలుస్తుంది. 
 
కూతుర్ని అత్తారింటికి పంపించిన తండ్రి ఆవేద‌న‌.. పెళ్ళైన కొడుకు భాద్య‌త‌గా వుంటున్నాడో లేదో అనుకునే త‌ల్లి ఆలోచ‌న ఇలా ఓ మంచి ఫ్యామిలిలో అన్ని ఎమోష‌న్స్ క‌లిసి వుంటాయి. అలాంటి అన్ని ఎమోష‌న్స్‌ని క‌లిపి శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంలో చూపించాము. శిరీష్ ఎన‌ర్జి సూప‌ర్బ్, లావ‌ణ్యతో వ‌చ్చే స‌న్నివేశాలు యూత్‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి. శిరీష్ పాత్ర‌లో ప్ర‌తి కుర్రాడు త‌న‌ని తాను చూసుకుంటాడు. అంత అంద‌మైన పాత్ర‌లో శిరీష్ అంత‌కు మించి న‌టించాడు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌, రావుర‌మేష్‌, సుమల‌త‌, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి న‌టీన‌టుల‌తో ఈ చిత్రం చేశాము అని చెప్పారు.
 
హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ.. నాకు మొద‌టి నుండి కూడా మంచి చిత్రాలు చెయ్యాలి అనే వుండేది. ఆ ద‌శ‌లోనే మంచి చిత్రాలు చేసాను కూడా, మంచి చిత్రాలు తీస్తున్నావు అని అంటుంటే మ‌న‌సులో చాలా ఆనందంగా వుంటుంది. క‌మ‌ర్షియ‌ల్‌ ఫార్ములాని మిక్స్ చేసి ఓ మంచి ఫ్యామిలి క‌థ‌ని ద‌ర్శ‌కుడు బుజ్జి నాకు చెప్పారు. సినిమా వినోద‌మే కాదు సినిమా ఆలోచించే విధంగా వుండాలి అని న‌మ్ముతాను. అలాంటి క‌థ మా 'శ్రీర‌స్తు శుభ‌మస్తు. ఈ చిత్రంలో ప్ర‌తి కేర‌క్ట‌ర్ మ‌రో కేర‌క్ట‌ర్‌కి రిలేటెడ్‌గా వుంటుంది. చిన్న కేర‌క్ట‌ర్‌కి కూడా వేల్యూ వుంటుంది. ఓక సీనియ‌ర్ న‌టుల‌తో న‌టిస్తే మ‌న‌లోని కాన్ఫిడేన్స్ లెవెల్ బెట‌ర్ అవుతుంది, అదే ఈ చిత్రంలో రావు ర‌మేష్ గారికి నాకు మ‌ద్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశంలో కానివ్వండి, ఇంకా ఇత‌ర పాత్ర‌ల‌తో న‌టించిన‌ప్పుడు కానివ్వండి. స్క్రీన్ మీద‌ తెలుస్తుంది. లావ‌ణ్య తొ సీన్స్ చాలా నేచుర‌ల్‌గా వుంటాయి అని చెప్పారు.
 
ఈ చిత్రంలో న‌టీన‌టులు.. అల్లు శిరిష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, రావ్ రమేష్, రవి ప్రకాష్, రణధీర్, సుబ్బరాజు, హంసానందిని, సుమిత్ర త‌దిత‌రులు న‌టించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments