Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దువ్వాడ జగన్నాథం' అంచనాలను మించుతుంది... అల్లు అర్జున్(వీడియో)

దువ్వాడ జగన్నాథం సినిమా అభిమానుల అంచనాలను మించుతుందన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నెల 23వ తేదీన డిజె సినిమా విడుదలవుతున్నట్లు చెప్పారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించామన్నారు అల్లు అర్జున్.

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (19:40 IST)
దువ్వాడ జగన్నాథం సినిమా అభిమానుల అంచనాలను మించుతుందన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నెల 23వ తేదీన డిజె సినిమా విడుదలవుతున్నట్లు చెప్పారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించామన్నారు అల్లు అర్జున్. 
 
తన బ్యానర్లో వస్తున్న అల్లు అర్జున్ మూడవ సినిమా దువ్వాడ జగన్నాథమని ఖచ్చితంగా అర్జున్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని దిల్ రాజు చెప్పారు. ఆర్టిస్టులు అందరూ ఎంతో నిబద్ధతతో పనిచేశారని, మరో 48 గంటల్లో సినిమా విడుదలై సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు దిల్ రాజు. 
 
తిరుమల వెంకన్న స్వామి బ్యానర్ మీదే సినిమా తీశామని, అర్జున్ డ్యాన్స్, ఫైట్లు, డైలాగ్‌లు అన్నీ ఇందులో ఎక్సార్డినరీగా ఉంటాయన్నారు దర్శకుడు హరీష్‌ శంకర్. తాను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పడం లేదని, యూనిట్ మొత్తం కష్టపడ్డందుకు ఫలితం దక్కుతుందన్న నమ్మకం ఉందన్నారు దర్శకుడు. 
 
దువ్వాడ జగన్నాథం సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు హీరోయిన్ పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాథం సినిమాల 23వ తేదీన విడుదల కానుండడంతో సినీనిర్మాత ఎన్.వి.ప్రసాద్ సహకారంతో దిల్ రాజు తిరుపతిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్‌ను భారీ గజమాలతో అభిమానులు సన్మానించి ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

మూర్ఖులు మారరా? భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments