ముచ్చటగా మూడోసారి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (12:39 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అల్లు అర్జున్ అడుగుపెట్టి 16 యేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ రివీట్ కానుంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్‌కు ఎంతో ఆనందాన్ని కలిగించింది. 
 
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో 'జులాయ్', 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలు రాగా, అవి సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మూడో చిత్రం రానుందనే ప్రచారం జరిగింది. కానీ, దానిపై క్లారిటీ రాలేదు. ఈ పరిస్థితుల్లో హరిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ ఓ ట్వీట్ చేసింది. 
 
బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌తో పాటు తాము కూడా చాలా ఆతృతగా ఉన్నామని హరిక అండ్ హాసిని క్రియేషన్స్ మార్చి 28వ తేదీ గురువారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు.. దీనికారణంగా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అంటూ తెలిపారు.
 
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ ఫిల్మ్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం త‌ర్వాత క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఈ హీరో. చాలా క‌థ‌లు విన్నారంట. చివరకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments