నా అల్లుడు బంగారం.. కట్నంగా ఎంత ఇచ్చామో తెలుసా? బన్నీ మామ

Webdunia
సోమవారం, 23 మే 2022 (10:38 IST)
Sri Reddy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. అయితే అ‍ల్లు అర్జున్‌కు సంబందించిన ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
 
రెండు కుటుంబాలను ఒప్పించి 2011లో బన్నీ, స్నేహ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వరుస సినిమా షూటింట్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. బన్నీ ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కొడుకు అయాన్, కూతురు అర్హతో సరదాగా గడుపుతారు. 
 
ముఖ్యంగా అర్హతో అతడికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అర్హతో గడిపిన మధుర మృతులను బన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. 
 
తాజాగా అల్లు అర్జున్‌ మామ, స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'మాకు అల్లు కుటుంబంతో అనుబంధం ఏర్పడక ముందే.. నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఇక అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి. బన్నీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అతడి సినిమా పాటలను జమ్మూ కశ్మీర్‌లో కూడా వింటున్నారు. ఇది అల్లు బన్నీ వర్క్‌తోనే సాధ్యమైంది' చంద్రశేఖర్‌ అన్నారు. 
 
'చిరంజీవి అడుగుజాడల్లో నడిచిన మెగా హీరోలు అందరూ ఎంతో ఎత్తుకు ఎదిగారు. అల్లుడిగా బన్నీకి వందకు వంద మార్కులు వేస్తా. పెళ్లి సమయంలో అల్లు అర్జున్ కట్నం తీసుకోలేదు. వాళ్లకే ఎక్కువ ఉంది. మనం ఇచ్చేది వాళ్లకి లెక్క కూడా కాదని నేను అనుకుంటున్నా. అల్లు ఫ్యామిలీ కట్నానికి వ్యతిరేకం' అని స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్‌ చెప్పారు. మొత్తానికి తన అల్లుడు బంగారం అంటూ చంద్రశేఖర్‌ ప్రశంసలు కురిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిద్రలోనే కాటేసిన మృత్యువు... భారీ వర్షానికి పాత ఇంటి గోడ కూలి...

యువకుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య - బాత్రూమ్‌లో చీరతో ఉరి

రూ.150 కోట్లతో ప్రపంచ స్థాయి రాష్ట్ర గ్రంథాలయం.. 24 నెలల్లో పూర్తవుతుంది.. నారా లోకేష్

Afghan Boy: కాబూల్ నుంచి ఓ బాలుడు ఢిల్లీకి ల్యాండ్ అయ్యాడు.. ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని?

దిగివచ్చిన ట్రంప్ సర్కారు.. కీలక రంగాలపై వీసా ఫీజు తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments