Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ నెం.150లో అల్లు అర్జున్ కూడా కనిపిస్తారట.. చిరు గనుక ఫోకస్ చేస్తే ఏడాదిలో సిక్స్‌ ప్యాక్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం.150' సంక్రాంతికి రిలీజ్ కానుంది. 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' తర్వాత ఆ రేంజ్‌లో క్రేజ్ ని సొంత

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (09:00 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెం.150' సంక్రాంతికి రిలీజ్ కానుంది. 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' తర్వాత ఆ రేంజ్‌లో క్రేజ్ ని సొంతం చేసుకొన్న సినిమాగా మెగాస్టార్ 'ఖైదీ నెం.150' నిలిచింది. మెగా అభిమానులతో పాటు, సినీ ప్రముఖులు మెగా ఖైదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
కానీ మెగాస్టార్ ఖైదీలో సర్‌ప్రైజ్‌లు బోలెడున్నాయట. ఖైదీలో చెర్రీ కనిపిస్తాడట. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..' సాంగ్‌లో మెగాస్టార్‌తో కలసి చెర్రీ స్టెప్పులేయనున్నాడు. అంతేకాందండోయ్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మెగా ఖైదీలో కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవినే తెలిపారు. మెగా ఖైదీలో రామ్ చరణ్, బన్నీ ఉన్నారన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. ఇది మెగా అభిమానులని ఖుషి చేసే న్యూస్. 
 
ఇదిలా ఉంటే.. ఖైదీ సినిమాలో తన పాత్రకు తగినట్టు మలచుకోవడానికి స్ట్రిక్ట్ డైట్ పాటించానని చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు ట్రైనర్, డైటీషియన్, జిమ్ ట్రైనర్ కూడా చరణేనని అన్నాడు మెగాస్టార్ చిరంజీవి. సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే సిక్స్ ప్యాక్‌కు తాను రెడీగా ఉన్నానని తెలిపారు. తాను గనుక ఫోకస్ చేస్తే ఓ సంవత్సరంలో సిక్స్ ప్యాక్ సాధించగలను అని ఇంటర్వ్యూలో చిరు ధీమాగా వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

Vijayamma: ఆ విషయంలో జగన్-భారతిని నమ్మలేం.. వైఎస్ విజయమ్మ

నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments