Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోయిన్ నా కుమార్తెలాంటిది : నిర్మాత అల్లు అరవింద్

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (17:34 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. గీతా ఆర్ట్స్ బ్యానరుపై అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్-2 పతాకంపై యంగ్ హీరోలతో చిత్రాలు నిర్మిస్తూ హిట్లు కొడుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయిపల్లవిపై ఆయన ప్రశంల వర్షం కురిపించారు. సాయిపల్లవి తనకు కుమార్తె లాంటివారన్నారు. సాయి పల్లవి తనకు కుమార్తె వంటివారని, తనకు ఓ కుమార్తె ఉంటే ఆమె‌లానే ఉంటుందని ఫీల్ అవుతానని చెప్పారు. అమరన్ చిత్రంలో ఆమె నటన చూసి భావోద్వేగానికి లోనైనట్టు చెప్పారు. 
 
అలాగే, ప్రతి సంక్రాంతికి మన సినిమా రావాలని అందరికీ ఉంటుందని, కానీ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిపారు. ఈ సినిమాకు మేము సోలో రిలీజ్ కావాలని కోరుతున్నట్టు చెప్పారు. థియేటర్స్ మా సినిమాకు షేర్ అవ్వకూడదు, ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అని, అందుకే మాకు ఎలాంటి అపోజిషన్ లేకుండా ఉండాలని, అనేక లెక్కలు వేసుకుని ఈ డేట్ ఫిక్స్ చేసినట్టు చెప్పారు. 
 
మేము చెప్పకుండానే "తండేల్" సంక్రాంతికి వస్తుందని కొందరు ఫిక్స్ అయిపోయారని, నిజానికి డిసెంబరు 20వ తేదీన రిలీజ్ అనుకున్నామనీ, పండుగకు పెద్ద సినిమాలు కూడా వస్తాయి కదా.. అప్పుడు కూడా రిలీజ్ చేయ్యెచ్చు కదా అని కొందరు అన్నారని గుర్తు చేశారు. మరికొన్ని సినిమాలు పండుగకు వస్తున్నాయి కాబట్టి .. పద్దతులు పాటించాలన్నారు. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments