మారేడుమిల్లి ప్రజానీకం కోసం అల్లరి నరేష్ పాట్లు, విడుదల తేదీ మార్పు

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (18:00 IST)
Allari Naresh
వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్‌, మెలోడీ సాంగ్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్.
 
ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments