Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్‌ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్‌ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (16:24 IST)
మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్‌ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్‌ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' మలయాళ మాతృక  చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన జి. ప్రజీత్‌ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. 
 
రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠతను కొలిపే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ నెల (మార్చి) 16 నుంచి ఏప్రిల్‌ 5 వరకు పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 16 నుంచి తదుపరి షూటింగ్‌ మొత్తం హైద్రాబాద్‌లో జరుపుకోనుంది. నిఖిల విమల్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలో నటించనున్నారు. 
 
అల్లరి నరేష్‌, నిఖిల విమల్‌, అవసరాల శ్రీనివాస్‌, హైపర్‌ ఆది, జయప్రకాశ్‌, జీవా, పద్మా జయంతి, తులసి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఉన్ని.ఎస్‌. కుమార్‌, ఎడిటర్‌: నందమూరి హరి, మ్యూజిక్‌: డి.జె.వసంత్‌, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, డైలాగ్స్: పిల్ల జమీందార్ అశోక్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎమ్‌.ఎస్‌. కుమార్‌, సమర్పణ: శ్రీమతి నీలిమ, ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ బొప్పన, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి. ప్రజీత్‌. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments