Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

డీవీ
బుధవారం, 20 నవంబరు 2024 (09:27 IST)
Allari Naresh
అల్లరి నరేష్ యూనిక్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ బచ్చల మల్లి. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా,  బాలాజీ గుత్తా నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగా, బచ్చల మల్లి డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
 
క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల బెనిఫిట్ వుంటుంది కాబట్టి సినిమా థియేటర్లలోకి రావడానికి ఇది పర్ఫెక్ట్ టైం. రిలీజ్ డేట్ పోస్టర్ నరేష్ రగ్గడ్ న్యూ లుక్‌లో అందరిద్రుష్టిని ఆకర్షించింది. చెదిరిన జుట్టు, గుబురు గడ్డంతో, సిగరెట్ తాగుతూ నరేష్ ఇంటెన్స్ అవతార్ అదిరిపోయింది.
 
ఫస్ట్ లుక్, బర్త్ డే స్పెషల్ గ్లింప్స్, ఫస్ట్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక నెలలో సినిమా ప్రేక్షకులు ముందు వస్తుండటంతో మేకర్స్ నెక్స్ట్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ని ప్రారంభిస్తారు.
 
అమృత అయ్యర్ కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రానికి సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
కథ, మాటలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, అడిషినల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments