Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగిల్ డే కాల్‌షీట్‌కి రూ. కోటి పారితోషికం. పవన్ కల్యాణ్ ఆల్‌టైమ్ రికార్డ్

భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి, ఏ స్టార్ నటుడికి సాధ్యం కాని రికార్డు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సొంతమవుతోంది. కాటమరాయుడు తర్వాత కొత్తగా తీయనున్న సినిమాకు 40 రోజుల షూటింగుకు గాను 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను పవన్ సొంతం చేసుకుంటున్నారు. అంటే సింగిల

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (09:48 IST)
భారతీయ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి, ఏ స్టార్ నటుడికి సాధ్యం కాని రికార్డు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సొంతమవుతోంది. కాటమరాయుడు తర్వాత కొత్తగా తీయనున్న  సినిమాకు 40 రోజుల షూటింగుకు గాను 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను పవన్ సొంతం చేసుకుంటున్నారు. అంటే సింగిల్ డే కాల్షీట్‌కి కోటి రూపాయలన్నమాట. 
మైండ్ బ్లోయింగ్ అనే మాటకే మైండ్ బ్లోయింగ్ అయ్యే లెక్క ఇది. 
 
వివరాల్లోకి వెళితే ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ ఇటీవలే పవన్ కల్యాణ్‌తో ఒక డీల్ కుదుర్చుకుంది. ప్రాధాన్యతా క్రమంలో 40 రోజుల కాల్ షీట్‌ను ఇస్తే పవన్ కల్యాణ్‌కి 40 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేసింది. 
 
అయితే ఈ సంస్థ 40 రోజుల్లో పవన్ కొత్ సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సిందే. తాజా సమాచారం ఏమిటంటే మైత్రి మూవీస్ ఈ డీల్ కుదుర్చుకోగానే పవన్ తాను ఎఎం రత్నంతో తీయనున్న  సినిమాను వెనక్కు నెట్టేశారు. మైత్రీ మూవీ మేకర్స్  తన కొత్త సినిమాకు సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తీస్తున్న చిత్రం పూర్తయినాక సెప్టెంబర్ నుంచి మైత్రీ మూవీమేకర్స్ తమ చిత్రం షూటింగును ప్రారంభించనున్నారని సమాచారం.
పవన్‌కల్యాణ్‌తో తీయనున్న ఈ కొత్త సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల  చేయాలని సంకల్పించారు. 
 
పూర్తికాలం రాజకీయాల్లోకి దుమికే ముందు  ఎంత వీలైతే అంత  డబ్బును సంపాదించి రిజర్వ్‌లో పెట్టుకోవడమే లక్ష్యంగా పవన్ వావులు కదుపుతున్నారు దీంట్లో భాగంగానే కాటమరాయుడు తర్వాత మరో రెండు సినిమాలను డిసెంబర్ లోపే పవన్ పూర్తి చేయనున్నారు. దీనిద్వారా మొత్తం 150 నుంచి 200 కోట్ల రూపాయలు పవన్ ఖాతాలోకి వెళతాయని భావిస్తున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments