Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలగం వల్ల నా పనులన్నీ వెనకబడ్డాయి : దిల్‌రాజు

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (17:42 IST)
Dilraju-Balagam movie
పెద్ద సినిమాకు హీరో, బేనర్‌ వాల్యూస్‌ వుంటాయి. వాటికి మీడియా రాసే రివ్యూస్‌కూ కలెక్షన్‌కూ తేడా వుంటుంది. అది బాగోలేదని రాసినా పెద్దగా పోయేదేమి వుండదు. స్టార్‌ స్టామినాపై ఆధారపడి వుంటుంది. కానీ చిన్న సినిమాకు ప్రమోషన్ బాగా చేయాలి. అందుకే బలగం అనే చిన్న సినిమాకు 20రోజులుగా ప్రమోషన్‌ చేస్తూనే వున్నాను అని నిర్మాత దిల్‌రాజు అన్నారు. ఆయన జిమార్తెలు హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలు. ప్రియదర్శి, కావ్యా జంటగా నటించారు. వేణు ఎల్ధండి దర్శకుడు. 
 
10 రోజులుగా ఫ్రీగా షోలు ఆంధ్ర, తెలంగాణలో కొన్ని వేశాం. ఎందుకంటే చిన్న సినిమాకు థియేటర్‌ వరకు ఆడియన్స్‌ రప్పించాలనే తాపత్రయం. అంత టైం కేటాయించి ప్రమోషన్‌ చేస్తేనే విడుదలరోజు 25 శాతం ఆడియన్స్‌ వచ్చారు. ఆ తర్వాత 75 శాతం వచ్చారు. అదికూడా 20 రోజులుగా ఈ  సినిమాకోసం కేటాయించాను. దాని వల్ల నేను చాలా సినిమాలు తీస్తున్నాను. దాని పనులన్నీ వెనకబడి పోయాయి అని అన్నారు.
 
బలగం అనే సినిమా తెలంగాణ మారు మూల ప్రాంతంలో వున్న కల్చర్‌. ఇది తెలంగాణా ప్రాంత కథ. ఆంధ్రకూ కనెక్ట్‌ అవుతుంది. చనిపోయిన వ్యక్తి కుటుంబంలో 10రోజుల తర్వాత ఏమి జరుగుతుంది. ఇంటి సభ్యులు ఏవిధంగా ఆ కార్యక్రమాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి వాతావరణ వుంటుందనేది ఈ సినిమా కథ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments