Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ఆగలేను.. పెళ్లికి సిద్ధమంటున్న "ఆర్ఆర్ఆర్" హీరోయిన్

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (13:56 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ మూవీలో టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు నటిస్తున్నారు. వచ్చే యేడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా, మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సివుంది. 
 
అయితే, తొలిసారి తెలుగు తెరకు పరిచయమవుతున్న అందాల ముద్దుగుమ్మ అలియా భట్... బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. వీరి ప్రేమాయణం గురించి బాలీవుడ్‌లో వార్తలేని రోజంటూ లేదు.
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ వర్గాల తాజా సమాచారం మేరకు... అలియా, రణ్‌బీర్‌ల వివాహం 2020 శీతాకాలంలో జ‌ర‌గ‌నుంద‌ని టాక్. డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప‌ద్ద‌తిలో జ‌ర‌గ‌నున్న వీరి వివాహానికి కొద్ది మంది అతిథుల‌ని మాత్ర‌మే ఆహ్వానిస్తార‌ని తెలుస్తుంది. 
 
అయితే ప్ర‌స్తుతం పలు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న రణ్‌బీర్, అలియాలు పెళ్ళి స‌మ‌యం వ‌ర‌కు అన్ని చిత్రాల షూటింగ్స్ పూర్తి చేస్తార‌ట‌. పెళ్లి త‌ర్వాత కూడా కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్‌ల‌కి దూరంగా ఉంటార‌ట‌. తమ పెళ్లితో పాటు మిగిలిన వివరాలపై అలియా భట్ త్వరలోనే మీడియా ముందుకు రావొచ్చన్నది బాలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments