Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితా.. అలియా భట్, దీపా కర్మాకర్, సాక్షిమాలిక్‌లకు చోటు

జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఒలింపిక్ పతక విజేత సాక్షీ మాలిక్, బాలీవుడ్ నటి అలియా భట్‌లకు అరుదైన గౌరవం లభించింది. వీరంతా 30 ఏళ్లలోపు వారే అయినా.. క్రీడారంగంలో దీప, సాక్షి.. సినీ రంగంలో అలియాభట్ సాధించిన

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (11:45 IST)
జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఒలింపిక్ పతక విజేత సాక్షీ మాలిక్, బాలీవుడ్ నటి అలియా భట్‌లకు అరుదైన గౌరవం లభించింది. వీరంతా 30 ఏళ్లలోపు వారే అయినా.. క్రీడారంగంలో దీప, సాక్షి.. సినీ రంగంలో అలియాభట్ సాధించిన విజయాలు చాలా ఎక్కువ. తక్కువ వయస్సులోనే అద్భుతాలు నమోదు చేసుకోవడం ద్వారా వీరు ముగ్గురు ఫోర్బ్స్ సూపర్ అచీవర్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 2017కు గాను ఆసియా స్థాయిలో ఫోర్బ్స్ వెల్లడించిన ‘30 అండర్‌ 30’ జాబితాలో వీరితోపాటు మొత్తం 53 మంది భారతీయులకు స్థానం లభించింది. 
 
ఇందులో వినోదం, క్రీడా రంగాల్లో సాక్షి, దీప, అలియా భట్ తమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాగా 24 ఏళ్లలోనే 20 అత్యధిక కలెక్షన్లు సంపాదించిన బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇక ఆర్థిక రంగం, వ్యాపారం, పారిశ్రామిక రంగం, సాంకేతిక రంగం.. ఇలా 10 రకాల విభాగాల్లో, ఒక్కో విభాగంలో 30 మంది చొప్పున అద్భుత విజయాలు సాధించిన 30 ఏళ్లలోపు వయసు గల వారితో ఈ జాబితాను ఫోర్బ్స్ జాబితాను రూపొందించడం జరిగింది. 
 
ఈ జాబితాలో 53 మంది భారతీయులు స్థానం సంపాదించుకున్నారు. తద్వారా భారత్ ఫోర్బ్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఫోర్బ్స్ జాబితాలో 76 మందికి స్థానం లభించడం ద్వారా చైనా అగ్రస్థానంలో నిలిచింది.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments