Webdunia - Bharat's app for daily news and videos

Install App

"విన్న‌ర్" చిత్రం ద్వారా ప‌రిచ‌యం కానున్న పీట‌ర్‌ హెయిన్స్

పీట‌ర్ హెయిన్స్ పేరు విన‌గానే యాక్ష‌న్ గుర్తొస్తుంది, కాని "విన్నర్" చిత్రం చూస్తే న‌వ్వొస్తుంది. విభిన్న‌మైన పాత్ర‌లు, విచిత్ర‌మైన గెట‌ప్స్‌తో కామెడికి బ్రాండ్ అంబాస‌డ‌ర్‌గా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్డ్‌గా ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తున్న ప్ర‌ముఖ కామెడి న

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (13:58 IST)
పీట‌ర్ హెయిన్స్ పేరు విన‌గానే యాక్ష‌న్ గుర్తొస్తుంది, కాని "విన్నర్" చిత్రం చూస్తే న‌వ్వొస్తుంది. విభిన్న‌మైన పాత్ర‌లు, విచిత్ర‌మైన గెట‌ప్స్‌తో కామెడికి బ్రాండ్ అంబాస‌డ‌ర్‌గా ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్డ్‌గా ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తున్న ప్ర‌ముఖ కామెడి న‌టుడు ఆలీ "విన్న‌ర్" చిత్రంలో పీట‌ర్ హెయిన్స్‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. 
 
అంతేకాదు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ వున్న ఈ చిత్రంలో ఆలీ పోషించిన పీట‌ర్ హెయిన్స్ పాత్ర ఇంట్ర‌డ‌క్ష‌న్ నుండి త‌న‌దైన శైలిలో న‌వ్వించారు. ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని అల‌రించి సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లో మ‌రో మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. దీనికి యాక్ష‌న్‌తో పాటు వెన్నెల కిషోర్‌, 30 ఇయ‌ర్స్ పృథ్వి, ఆలీలు విభిన్న‌మైన పాత్ర‌లు చేసి ఆద్యంతం న‌వ్వులు కురిపించారు.
 
సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్నినిర్మించారు. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న యుస్‌లో 100 థియేట‌ర్స్‌లో విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయం చేయలేం.. ఎందుకో తెలుసా?

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments