Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులు గురించి నాగార్జున కామెంట్, ఇంతకీ విషయం ఏంటి..?

Webdunia
గురువారం, 28 మే 2020 (22:34 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంటారు. ఆయన సినిమా రిలీజ్ టైమ్‌లో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉంటారు. ఇటీవల కరోనా కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఈ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి అనేది తోటి నటీనటులు, నిర్మాతలతో కలిసి చర్చించారు.
 
సీఎం కేసీఆర్‌ను కలిసి షూటింగ్స్ కోసం పర్మిషన్ అడిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... ప్రభుత్వం దేశం నలుమూలల నుండి శ్రామిక రైళ్లలో వలసదారులను వారి స్వస్థలాలకు చేరుస్తున్నారు.
 
ముంబై నుండి తమిళనాడుకు వస్తున్న శ్రామిక్ రైలు లోని వలస కూలీలు ఆహారం లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని తమిళనాడు పోలీసుల నుండి తెలుసుకున్న ఆంధ్ర పోలీసులు గుంతకల్‌లో వారికి ఆహారాన్ని అందించారు.
 
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కినేని నాగార్జున ట్విట్టర్లో ఆంధ్ర పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ఈ కరోనా విపత్తులో పోలీసులు చేస్తున్న సేవకు కృతజ్ఞతలు అని ఆంధ్ర పోలీసులు చేసిన ఈ సహాయం ద్వారా పోలీసులు తాము రక్షకులు మాత్రమే కాదు సేవకులు కూడా అని చాటి చెప్పారని నాగార్జున ఈ సందర్భంగా తెలియచేసారు.
 
నాగార్జున పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన లభించింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments