Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపుబ్బ నవ్వించే కమెడియన్‌గా నాగార్జున...

టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. ఆయనేంటి కడుపుబ్బ నవ్వించడమేంటి అనుకుంటున్నారా. నిజమే.. ఎప్పుడూ మాస్, ఫ్యామిలీ ఓరియెంటెండెంట్ సినిమాల్లో నటించే నాగార్జున మొదటిసారి ఫుల్‌లెంత్ కమెడియన్‌గా ప్రేక్ష

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (15:31 IST)
టాలీవుడ్ అగ్ర హీరోల్లో నాగార్జున ఒకరు. ఆయనేంటి కడుపుబ్బ నవ్వించడమేంటి అనుకుంటున్నారా. నిజమే.. ఎప్పుడూ మాస్, ఫ్యామిలీ ఓరియెంటెండెంట్ సినిమాల్లో నటించే నాగార్జున మొదటిసారి ఫుల్‌లెంత్ కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించబోతున్నారు. అది కూడా మల్టీస్టారర్ చిత్రంలో. మరో హీరో నాని కూడా ఇందులో నటించబోతున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే ఇద్దరూ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
 
'భలే మంచిరోజు', 'శమంతకమణి' చిత్రాలతో తనేంటో నిరూపించుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. కథను చెప్పగానే నాగార్జునకు బాగా నచ్చేసిందట. దీంతో తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని దర్శకుడికి చెప్పారట నాగ్. 
 
ఇక నాగార్జునలాంటి అగ్ర హీరోతో కలిసి నటించడమంటే మాటలా.. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటున్నారు మరో హీరో నాని. మొదట్లో తాను కమెడియన్‍‌‌గా నవ్వించగలుతానా? అని దర్శకుడిని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఆ క్యారెక్టర్‌కు మీరు సరిపోతారని శ్రీరామ్ చెప్పడంతో నాగ్ ఓకే చెప్పేశారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments