Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినూత్నంగా అక్కడ వారు ఇక్కడ ఉన్నారు సినిమా పోస్టర్

డీవీ
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (15:31 IST)
Trivikrama Rao Kundurthi, Pratani Ramakrishna Goud, Guru Raj
త్రివిక్రమ రావు కుందుర్తి నిర్మిస్తూ, దర్శకత్వం వహించిన అక్కడ వారు ఇక్కడ ఉన్నారు మూవీ పోస్టర్ లాంచ్ నేడు ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురు రాజ్, ఈ సినిమా నిర్మాత దర్శకుడు త్రివిక్రమ రావు కుందుర్తి  మరియు ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా టి ఎఫ్ సి సి చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ : అక్కడ వారు ఇక్కడ ఉన్నారు టైటిల్, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్రివిక్రమ రావు మొదటి సినిమా అయిన ఇంతమంది ఆర్టిస్టులతో పనిచేయించుకోవడం గొప్ప విషయం. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులను సన్మానించుకోవడం చాలా మంచి విషయం. సినిమనే లోకం సినిమానే ప్రపంచం అనుకునే వ్యక్తి త్రివిక్రమ రావు. ఎప్పుడు కలిసిన సినిమా గురించే మాట్లాడుతారు. అలాంటి వ్యక్తి తీసిన సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకొంతమంది టెక్నీషియన్స్ ఇంకొన్ని మంచి సినిమాలు మన ముందుకు వస్తాయి. ఈ సినిమా ఈ టీం కి మంచి సక్సెస్ అవ్వాలని మీ ఆదరణ ఆశీస్సులు ఇలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున చిన్న సినిమాలే పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి ఈ సినిమా కూడా అలాగే మంచి విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది అన్నారు.
 
గురు రాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాకి దర్శకత్వం వహించిన త్రివిక్రమ రావు ఈ సినిమా సక్సెస్ తో త్రివిక్రమ్ 2 గా ఎదగాలని కోరుకుంటున్నాను. త్రివిక్రమ్ కూడా చిన్న సినిమాలు నుంచి మొదలుపెట్టి ఈ రోజున తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఈ త్రివిక్రమ రావు కూడా త్రివిక్రమ్ 2 గా గుర్తింపు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమాలు నిర్మించి ఫెయిల్ అయితే ఆ దర్శకుడు నిర్మాత కనబడరు అలాంటి వారిని కూడా గుర్తించి సన్మానించడం అనేది త్రివిక్రమ్ 2కి చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. చిన్న సినిమాలు రావాలి మంచి విజయాలు సాధించాలి. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మీ ఆదరణ ఆశీస్సులు ఈ సినిమాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
దర్శకుడు త్రివిక్రమ రావు కుందుర్తి మాట్లాడుతూ, అన్నమాట ప్రకారం ఈ రోజున అతిధితులు  ఈవెంట్ కు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ముందు ముందు ఇంకా మంచి సినిమాలు తో ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తే సినిమాలు నిర్మిస్తాను వాటికి కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.  ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రేక్షకుల ప్రేమ అభిమానం ఆశీస్సులు ఎప్పుడూ నాపై మా టీం పై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

చెన్నై మహానగరంలో పెరిగిపోతున్న అంతు చిక్కని జ్వరాలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

కర్ణాటకలో పరువు హత్య.. పూజారినే పెళ్లి చేసుకుంటానన్న కుమార్తెను చంపేసిన తండ్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments