Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ కంటే శ్రియ పెద్ద.. బ్రేకప్ ఎప్పుడో అయిపోయింది.. నాగ్ సైలెంట్ అందుకేనా?

టాలీవుడ్‌లో క్రేజ్ హీరో.. అందగాడు.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు తర్వాత అఖిల్ మాత్రమేనని అందరూ అనుకుంటున్నారు. తొలి సినిమా అంతగా క్రేజ్ సంపాదించి పెట్టకపోయినా.. అఖిల్ హీరోగా నిలదొక్కుకుంటాడని అక్కిన

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (15:35 IST)
టాలీవుడ్‌లో క్రేజ్ హీరో.. అందగాడు.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు తర్వాత అఖిల్ మాత్రమేనని అందరూ అనుకుంటున్నారు. తొలి సినిమా అంతగా క్రేజ్ సంపాదించి పెట్టకపోయినా.. అఖిల్ హీరోగా నిలదొక్కుకుంటాడని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ అప్పుడే పెళ్లి మాట వచ్చేసరికి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. బాగా డబ్బున్న అమ్మాయిని అఖిల్ పెళ్ళి చేసుకుంటున్నాడని.. ఇక అతనికి ఎలాంటి ఢోకా లేదని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అక్కినేని అఖిల్, శ్రియ భూపాల్‌ల మధ్య జరగాల్సిన పెళ్లి రద్దు అయ్యిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
ఇప్పటికే పెళ్ళి పనులు ఆగిపోయాయని ప్రచారం సాగుతోంది. దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా.. అఖిల్‌, శ్రియ భూపాల్‌ల పెళ్లి క్యాన్సిల్‌ అయిందనే వార్త మీడియాలో ఇప్పుడే వచ్చినా వారి మధ్య బ్రేకప్ ఎప్పుడో జరిగిపోయిందని సమాచారం. నిజానికి ఈ పెళ్లి నాగార్జునకు మొదట్నుంచీ ఇష్టం లేదట. చిన్న ఏజ్‌ (22 ఏళ్ల)లో, అఖిల్.. వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్‌ కాదని అఖిల్‌కు నాగ్‌ ఎంతగానో నచ్చ చెప్పాడట. చైతన్య కూడా వారించాడట. అయినప్పటికీ అఖిల్‌ వినకపోవడంతో సరే చెప్పేసిందట అక్కినేని కుటుంబం.
 
అయితే అఖిల్‌, శ్రీయల మధ్య హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రోమ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్‌, శ్రియ, ఆమె తల్లి బయల్దేరాట. అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే అఖిల్‌, శ్రియల మధ్య విభేదాలు తలెత్తాయట. అక్కడే బహిరంగంగా వాదనకు దిగారాట. వాదన ముదిరిపోవడంతో.. అనంతరం శ్రియను.. ఆమె తల్లిని అక్కడే వదిలేసి గుడ్ బై చెప్పేసి అఖిల్ ఇంటికి వెళ్ళిపోయాడని తెలుస్తోంది. నాగార్జున ఎన్ని ప్రయత్నాలు చేసినా అఖిల్, నాగార్జునల మధ్య సయోధ్య కుదర్చలేకపోయాడని టాక్. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments