Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్ 8న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ విడుదల

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:20 IST)
Akil-pooja
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా అక్టోబర్ 8న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాణ‌సంస్థ ప్ర‌క‌టించింది. అల్లు అరవింద్ సమర్పణలో `బొమ్మరిల్లు` భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. బన్నీ వాసు మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన ప్రతి అప్డేట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కంటెంట్ కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. 
 
ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ ప్రత్యేకత వుంటుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments