Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేని, సాక్షి వైద్యల అందమైన ఏజెంట్ ఫస్ట్ సింగిల్ పాట విడుదల (video)

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (19:42 IST)
Akhil Akkineni and Sakshi Vaidya
హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లో ఒకటిగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. మేకర్స్ ఈ రోజు మొదటి సింగిల్ మళ్ళీ మళ్ళీ పాటని  విడుదల చేసారు. ఈ పాటను అక్కినేని ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. మొదటిసారిగా, అఖిల్ ట్విట్టర్ స్పేస్‌లలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు.   పాటను యూనిక్ స్టయిల్ లో లాంచ్ చేశారు.
 
ఈ పాట ఇప్పటికే ప్రోమో వెర్షన్‌ తో ప్రజాదరణ పొందింది.  పూర్తి వెర్షన్ విన్నర్ గా నిలిచింది. ఈ ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ కి క్లాసిసిజం టింజ్  ఉంది. మైల్డ్ బాస్ వర్క్ పాట కు హైలైట్. హిప్-హాప్ తమిళ వినగానే ఆకట్టుకునే నెంబర్ ని కంపోజ్ చేశారు. పాటలో వినిపించిన ఇంగ్లీష్ ర్యాప్‌ మరింత ఇంపాక్ట్ ని  జోడిస్తుంది.
 
అఖిల్ ఈ పాటలో అల్ట్రా-స్టైలిష్‌గా కనిపించారు.  లవ్లీ ఎక్స్ ప్రెషన్స్ ,  ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు. సాక్షి వైద్య అందంగా కనిపించింది.  లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మనల్ని కట్టిపడేస్తుంది. బ్యూటీఫుల్ ఫారిన్ లొకేల్స్‌లో రూపొందించిన పాటలోని విజువల్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి.
 
సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్,  క్యారెక్టర్‌లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్ కెమెరా వర్క్ అందిస్తున్నారు.
 
 ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

 
అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతుంది.

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments