Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి బరిలోకి అజిత్ కుమార్ తెగింపు

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (07:36 IST)
Ajith Kumar
కోలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోగా అజిత్ కుమార్‌కు అసామాన్యమైన అభిమాన గణం ఉంది. అజిత్ నటించే సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి దగ్గరైన అజిత్ తన కొత్త సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి బరిలోకి అజిత్ కుమార్ తెగింపు అంటూ రాబోతోన్నారు. తునివు అంటూ తమిళంలో సందడి చేయనున్న అజిత్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగింపు అనే టైటిల్‌తో రాబోతోన్నారు.
 
తలా అంటూ ముద్దుగా పిలుచుకునే అజిత్‌ కుమార్ సినిమాలకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులోనూ అజిత్ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి తెగింపు అంటూ అజిత్ రాబోతోన్నాడని తెలియడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. హెచ్ వినోద్ తెరకెక్కించారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.
 
రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంయుక్తంగా తెగింపు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. సంక్రాంతి బరిలో దిగబోతోన్నట్టుగా మేకర్లు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో అజిత్ కుమార్ ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన అఫీషియల్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖణి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments