Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలే కాదు.. అలాంటి సినిమాలు కూడా వద్దు.. అజిత్

Webdunia
గురువారం, 30 మే 2019 (15:26 IST)
హీరోలు రాజకీయాలలోకి దిగడం పరిపాటిగా మారింది. తమిళ స్టార్ హీరో అజిత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అజిత్ మాత్రం దీనికి మొగ్గు చూపే పరిస్థితిలో లేడు. జయలలిత బతికి ఉన్న సమయంలో ఆమె వారసుడు అజిత్ అంటూ ప్రచారం జరిగింది. జయలలితకు అతడు సన్నిహితంగా మెలిగినా రాజకీయాలపై ఆసక్తి చూపించలేదు. 
 
పలు రాజకీయ పార్టీలు అజిత్‌ను తమ వైపుకు లాక్కోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఒక బీజేపి నాయకుడు అజిత్‌ను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. అజిత్‌కు రాజకీయాలంటే అసలు ఇష్టం ఉండదు. రియల్ లైఫ్‌లోనే కాక రీల్‌లో కూడా రాజకీయ నేపథ్యాలకు దూరంగా ఉంటాడు. 
 
గతంలో ఎప్పుడు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు అజిత్ చేయలేదు. అజిత్ వద్దకు తాజాగా హెచ్ వినోద్ ఒక పొలిటికల్ డ్రామా స్క్రిప్ట్‌ను తీసుకువచ్చాడట. అజిత్ 60 చిత్రంగా ఆ సినిమా తెరకెక్కాల్సి ఉంది. కానీ అజిత్ దానిని తిరస్కరించాడు. సినిమా వద్దంటే వద్దనేసి మరో స్క్రిప్ట్ కు ఓకే చెప్పాడు. తమిళ సినీ వర్గాల్లో ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి. 
 
చివరకు అజిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఓకే చెప్పాడు. పోలీస్ వ్యవస్థలో ఉన్న అవినీతికి సంబంధించీ, పోలీసులను లంచాలు ఇచ్చి నేరాలు చేస్తున్న నేరగాళ్ల గురించిన నేపథ్యంలో ఈ చిత్రం కథ ఉంటుందట. అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి చాలా కాలం అయింది. ఈ నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అజిత్ 60వ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments