Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే కావాలనుకునే అజయ్ ఘోష్ చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్

డీవీ
శనివారం, 25 మే 2024 (16:27 IST)
Ajay Ghosh, Chandini Chaudhary
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 
 
ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన  ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్‌ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 
 
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయింది.
 
ఈ చిత్రంలో అజయ్ ఘోష్  డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్‌స్పైరింగ్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 ఈ చిత్రానికి శ్రీనివాస్ బెజుగం కెమెరామెన్‌గా పని చేయగా, పవన్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.
 తారాగణం: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments