Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ‌మౌళి... ఇది నిజ‌మేనా..?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (13:15 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న సంచ‌ల‌న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న ఈ సంచ‌ల‌న చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ నిర్మాత దాన‌య్య ఏ మాత్రం రాజీప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌లో మూడు ఆర్‌లున్నాయి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి.. ముగ్గురు మెయిన్‌ పిల్లర్స్‌.
 
ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇంత‌కీ ఆ వార్త ఏంటంటే... ఈ సినిమాలో పాటలు కూడా మూడే ఉంటాయట. ఇది ఎంత‌ వరకు నిజమో కానీ ఈ వార్త మాత్రం ఆసక్తికరంగానే ఉంది. సినిమాల్లో పాటల కన్నా ఇంట్రెస్టింగ్‌ ఎపిసోడ్స్‌ పెట్టాలనేది రాజమౌళి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. పాటలను తగ్గిస్తూ వస్తున్నారు.
 
ఇపుడు ఏకంగా మూడు పాటల మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ సూపర్‌ డ్యాన్సర్స్‌. మరి ఇద్దరికీ చెరో రెండు పాటలు కూడా లేకపోతే ఫ్యాన్స్‌ ఒప్పుకుంటారా? అనేది అంద‌రిలో ఉన్న అనుమానం. మ‌రి.. నిజంగా మూడు పాటలతోనే రాజమౌళి సరిపెడుతాడా..?  లేక మ‌రో పాట‌ను యాడ్ చేస్తాడా..? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments