Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫ్ సెన్సార్ చేయడానికి మేము పోర్న్ సినిమా తీయలేదు: అజయ్ దేవగన్ ఫైర్

ఎమెర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో బాద్‌షాహో అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మిలాన్ లుత్రియా. అజ‌య్ దేవ‌గ‌న్ ప్రధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హ‌ష్మీ, ఇషా గుప్తా, ఇలియానా, వ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (13:15 IST)
ఎమెర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో బాద్‌షాహో అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మిలాన్ లుత్రియా. అజ‌య్ దేవ‌గ‌న్ ప్రధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హ‌ష్మీ, ఇషా గుప్తా, ఇలియానా, విద్యుత్ జాంవాల్, సంజ‌య్ మిశ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొద్ది రోజులుగా చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్‌ని విడుద‌ల చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ఇలియానా లుక్ విడుద‌ల చేసింది. 
 
2010లో వచ్చిన వన్స్ అప్ ఆన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమా తర్వాత అజయ్‌దేవ్‌గన్, ఇమ్రాన్‌హష్మీ, మిలన్‌లు మ‌రో సారి సంద‌డి చేయ‌బోతున్నారు. నాలుగో సారి మాలీన్, అజ‌య్ క‌లిసి ప‌నిచేయ‌డం విశేషం. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగణ్, ఇలియానా రెచ్చిపోయి నటించారని, రొమాంటిక్ సన్నివేశాల్లో అద్భుతమైన కెమిస్ట్రీ పండిందని టాక్. 
 
ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాను సెల్ఫ్‌ సెన్సార్ చేశారని బాలీవుడ్‌లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై అజయ్ దేవగణ్ మండిపడ్డాడు. అలాంటి పుకార్లు ఎలా వస్తాయో? అని ఫైర్ అయ్యారు. అవన్నీ అసత్యాలని తీవ్రంగా ఖండించారు. సెల్ఫ్ సెన్సార్ చేయడానికి తామేమీ పోర్న్ సినిమా తీయలేదని అజయ్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. కథ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తయ్యిందని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవమానభారం భరించలేక ఇద్దరు పిల్లలను చంపేసి తాను కూడా...

బాలీవుడ్ నటుడు సైఫ్‌కు వారసత్వ ఆస్తులు దక్కేనా?

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం