Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమ్మ పురట్చితలైవి' బయోపిక్ : జయలలితగా ఐశ్వర్యారాయ్.. ఎంజీఆర్‌గా కమల్ హాసన్

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా "అమ్మ పురట్చితలైవి" అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జయలలిత పాత్ర కోసం మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌ను సంప్రదిస్తున్నారు.

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (09:20 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా "అమ్మ పురట్చితలైవి" అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జయలలిత పాత్ర కోసం మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌ను సంప్రదిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించనుండగా, ఎంజీఆర్ పాత్రలో విశ్వనటుడు కమల్ హాసన్ లేదా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
ఈ చిత్రాన్ని ఆదిత్యా భరద్వాజ్ నిర్మించనున్నారు. దీనిపై ఆ చిత్ర నిర్మాత ఆదిత్యా స్పందిస్తూ, కోటానుకోట్ల మంది ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకుని తిరిగిరాని లోకాలకు చేరుకున్న జయలలిత బయోపిక్‌ను నిర్మించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు, స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. డిసెంబరులో చిత్ర షూటింగ్ ప్రారంభంకావొచ్చని ఆయన తెలిపారు. 
 
అయితే, ఈ చిత్రంలో జయలలిత పాత్ర కోసం ఐశ్వర్యా రాయ్‌ను సంప్రదిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఎంజీఆర్‌గా కమల్ హాసన్ లేదా మోహన్‌లాల్ నటించే అవకాశం ఉందని తెలిపారు. జయలలిత జీవించివుండగా ఆమె ప్రియనెచ్చెలి శశికళ కీలక భూమిక పోషించారనీ, అందువల్ల ఈ బయోపిక్‌లో కూడా శశికళ పాత్ర ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నటించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments