Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ విడుదల చేసిన అహింస థియేట్రికల్ ట్రైలర్‌

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (14:55 IST)
abhiram, Geetika Tiwari,
దర్శకుడు తేజ, అభిరామ్ తో తొలి చిత్రంగా తెరకెక్కుతున్న 'అహింస' చిత్రంతో అలరించేందుకు సిద్ధంగా వున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ముందుగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు అహింస థియేట్రికల్ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
 
ట్రైలర్ సూచించినట్లుగా.. అహింస టిపికల్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కాదు. ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ప్రేమకథ వున్నప్పటికీ, అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ట్రైలర్ సినిమాలోని విభిన్న కోణాలను ప్రజంట్ చేసింది
 
అభిరామ్‌ని క్రిమినల్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం, కథానాయకుడిని కొందరు క్రిమినల్స్ వెంబడించడంతో క్రైమ్ థ్రిల్లర్‌గా ట్రైలర్ మొదలవుతుంది. ఒక ప్రముఖ క్రిమినల్ లాయర్ అభిరామ్ కేసును టేకప్ చేయడానికి నిరాకరించడంతో అభిరామ్ ని  కాపాడటానికి యంగ్ లాయర్ సదా వస్తుంది. ట్రైలర్‌.. విలేజ్ లో అభిరామ్ , మరదలు గీతికల అందమైన ప్రేమకథను కూడా చూపిస్తుంది. తన కష్టాలు నుంచి బయటపడటానికి శ్రీకృష్ణుని మార్గాన్ని అవలంబిస్తాడు అభిరామ్.
 
ట్రైలర్‌ను పరిశీలిస్తే, దర్శకుడు తేజ విభిన్నమైన కథాంశంతో ముందుకు వచ్చారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం క్రైమ్ అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుంది. అభిరామ్ చాలా షేడ్స్‌తో కూడిన ఇంటెన్స్ క్యారెక్టర్‌లో అద్భుతంగా కనిపించాడు. ఇందులో గీతిక అతని ప్రేయసిగా ఆకట్టుకుంది. సదా లాయర్‌గా కీలకమైన పాత్రలో కనిపించారు.
 
ఆర్‌పి పట్నాయక్ తన అద్భుతమైన బిజిఎమ్‌తో విభిన్న మూడ్‌లను సెట్ చేశాడు.  సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఎక్స్ ట్రార్డినరీ వుంది. టీజర్‌పై మంచి అంచనాలు నెలకొల్పగా, ట్రైలర్ క్యూరియాసిటీని మరింత పెంచింది.
 
ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ కాగ, అనిల్ అచ్చుగట్ల డైలాగ్స్ అందిస్తున్నారు. సుప్రియ ఆర్ట్ డైరెక్టర్.
 
త్వరలోనే సినిమాను థియేటర్లలోకి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments