Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అజ్ఞాతవాసి" ఆ సినిమాకు కాపీనే.. తేల్చేసిన ఫ్రెంచ్ డైరక్టర్

త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా ''అజ్ఞాతవాసి'' సినిమా కాపీ అని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి 'లార్గో వించ్' చిత్రానికి కాపీ అని గతంలోనే సినీ క్రిటిక్ కత్తి మహేష్ కామెంట్

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (10:32 IST)
త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా సినిమా ''అజ్ఞాతవాసి'' సినిమా కాపీ అని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి 'లార్గో వించ్' చిత్రానికి కాపీ అని గతంలోనే సినీ క్రిటిక్ కత్తి మహేష్ కామెంట్ చేశాడు. అలాగే ఈ సినిమా కథపై స్పష్టత ఇవ్వాలని 'లార్గో వించ్ ' భారత హక్కులను సొంతం చేసుకున్న టీ-సిరీస్ నుంచి 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు నోటీసులు కూడా అందాయి.  
 
ఈ నేపథ్యంలో 'అజ్ఞాతవాసి' సినిమాను 'లార్గో వించ్' దర్శకుడు జెరోమ్ సాలీ వ్యాఖ్యానించారు. గత రాత్రి లీ బ్రాడీలోని మెట్రో 4 థియేటర్‌లో 7.45 గంటల షోను చూసిన ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తాను సినిమాను చూశానని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా కథ, తన చిత్ర కథకు చాలా దగ్గరగా ఉందని చెప్పారు. 
 
అయితే అజ్ఞాతవాసి సినిమా రివ్యూ టాక్ పాజిటివ్‌గా వచ్చింది. అమెరికాలో ''అజ్ఞాతవాసి'' థియేటర్లకు రాకుండానే రికార్డులు సృష్టిస్తున్నాడు. తొలి ఆట కూడా పడకుండానే అడ్వాన్స్ బుకింగుల్లో రికార్డు నమోదైంది. థియేటర్ల ఎదుట పవన్ అభిమానులు బారులు తీరారు. ‘అజ్ఞాతవాసి’ మేనియాతో ఊగిపోతున్నారు. 
 
సంక్రాంతి కానుకగా పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి మొదలైనట్లు కనిపిస్తోంది. పవన్ ఫ్యాన్స్ అజ్ఞాతవాసి సినిమా విడుదల కావడంతో ముందుగానే పండగ చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments