Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తికేయ2 విజ‌యం త‌ర్వాత 18 పేజెస్ షూట్‌లో నిఖిల్‌

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (10:16 IST)
Nikhil in 18 pages shoot
యంగ్ హీరో నిఖిల్‌కు కార్తికేయ సీక్వెల్ ఎంతో క‌లిసి వ‌చ్చింది. కార్తికేయ ఘ‌న‌విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. సీక్వెల్‌గా కార్తికేయ2 చేశాడు. ఊహించ‌నివిధంగా పాన్ ఇండియా హీరోగా నిఖిల్ ఎదిగిపోయాడు. ఆ సినిమా విమ‌ర్శ‌కుల‌ను సైతం మంత్ర‌ముగ్థుల్ని చేసింది. అన్ని భాష‌ల్లోనూ విజ‌యాన్ని సాధించి తెలుగు సినిమాను ఊపిరిని మ‌రింత పెంచింది.
 
తాజాగా నిఖిల్ త‌దుప‌రి చిత్రం 18 పేజెస్ కోసం చివరి షెడ్యూల్ షూట్‌లో చేరాడు. దీపావ‌ళి సంద‌ర్భంగా టీమ్‌తో సంద‌డి చేశారు. నిఖిల్ షూట్‌కు రాగానే చిత్ర యూనిట్ అంతా సంద‌డి నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా నిఖిల్ వారితో ఇలా ఫొటోకే స్టిల్ ఇచ్చి ఆనందాన్ని వ్య‌క్తం చేసుకున్నారు. ఈ సినిమాకు జీనియస్ దర్శకుడు  సుక్కు కథ అందించారు. డిసెంబర్ 23న థియేట్రికల్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ కొత్త అప్‌డేట్‌ను వెల్ల‌డించింది. 
 
 2021లో ప్రారంభ‌మైన 18 పేజెస్.  రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ గా రూపొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments