Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

డీవీ
మంగళవారం, 26 నవంబరు 2024 (14:11 IST)
vedika
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. 
 
"ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రోజు "ఫియర్" సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
 
ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసిన "ఫియర్" టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు ప్రేక్షకుల్లో ఏర్పడుతున్నాయి. పలు అంతర్జాతీ ఫిలిం ఫెస్టివల్స్ లో రికార్డ్ స్థాయిలో 70 కి పైగా అవార్డులు గెల్చుకోవడం కూడా "ఫియర్"  మూవీపై హైప్ క్రియేట్  చేస్తోంది.
 
నటీనటులు - వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు రచన, ఎడిటింగ్, దర్శకత్వం - Dr. హరిత గోగినేని

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments