Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామానాయుడు గారు చనిపోయాక మాట తప్పాననే గిల్టీగా ఫీలయ్యా: తేజ

Webdunia
మంగళవారం, 30 మే 2023 (12:32 IST)
director Teja
డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. చిత్రం 2 అని మొదట పేరు అనుకున్నారు.  కానీ  కథను బట్టి అహింస గా మార్చారు. 
 
తేజ మాట్లాడుతూ..నేను రకరకాల మందిని పరిచయం చేశాను. అభిరాంనే ఎందుకు పరిచయం చేయాలి ? అభిరాం వాళ్ళకే సొంత నిర్మాణ సంస్థ ఉంది. వాళ్ళే చేసుకోవచ్చు. కానీ దీనికి కారణం రామానాయుడు గారు ఉన్నప్పుడు మా మనవడితో సినిమా చేయాలని అడిగారు. చేస్తానని చెప్పాను. తర్వాత ఆయన ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. కొన్నిరోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి నాకు గిల్ట్ పట్టుకుంది. అంత పెద్ద మనిషి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా మాట తప్పాననే గిల్ట్ ఉండిపోయింది. అప్పుడు అభిరాం కోసం కథ రెడీ చేశాను. సురేష్ గారికి చెబితే ఆయన పెద్ద ఆసక్తి చూపలేదు. తర్వాత సరే అన్నారు. ఈ సినిమా రామానాయుడు గారి గురించి చేశాను. అంతకుముందు రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశాను.  మళ్ళీ రానా గారితో సినిమా చేయబోతున్నా.  అహింస తో అభిరాం, గీతిక పరిచయం అవుతున్నారు. ఇద్దరిని చాలా కష్ట పెట్టా. నా దెబ్బకి సగం అయిపోయారు  అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments