Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడు-2లో మహానటి కాంబో..? మళ్లీ స్క్రీన్‌పై సమంత, కీర్తి సురేష్?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (11:04 IST)
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోన్న చిత్రం ''మన్మథుడు 2''. అక్కినేని నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
త్వరలో పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో మహానటి నటించనుందని టాక్. అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే సమంత ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, కీర్తి సురేశ్ కూడా మరో కీలక పాత్రను పోషిస్తుందన్నది తాజా సమాచారం.
 
ఇకపోతే.. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం నటించడం లేదట. మన్మథుడు చిత్రానికి బ్రహ్మానందం కామెడీ ఎంత ప్లస్సో అందరికీ తెలిసిందే. అలాంటిది ‘మన్మథుడు 2’ చిత్రంలో బ్రహ్మానందం లేడనే విషయం సినీ ప్రేమికులను నిరాశపరచడం ఖాయమని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
కానీ బ్రహ్మానందం స్థానంలో ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ నటించనున్నాడట. కానీ మన్మథుడు-2లో బ్రహ్మీని మ్యాచ్ చేయడం ఎవరితరం కాదని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments