నాగార్జునతో వర్మ సంచలన మూవీ...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్ధమవుతున్నారు. అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జునతో వర్మ సినిమా తీయనున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాను చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు.

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (15:07 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్ధమవుతున్నారు. అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జునతో వర్మ సినిమా తీయనున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాను చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ బ్యానర్‌పైనే సినిమా తీసేందుకు నాగ్ ఒప్పుకున్నారు. సినిమాకు సంబంధించి కథను కూడా ఇప్పటికే వర్మ సిద్ధం చేసినట్టు సమాచారం. 
 
సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. కాలేజ్ స్టూడెంట్‌గా నాగార్జున నటించిన "శివ" ఎంత భారీ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమానే లేదు. 
 
కానీ నాగార్జున ఫిజిక్‌కు తగ్గట్లు ఒక కథను వర్మ సిద్ధం చేసి వినిపించారట. ఆ కథను విన్నదే సినిమా మన బ్యానర్‌లోనే చేద్దామని నాగార్జున చెప్పారట. ప్రస్తుతం సమంత, నాగచైతన్య వివాహ వేడుకల్లో బిజీగా ఉన్న నాగ్ ఇదంతా పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అర్థరాత్రి మహిళను లాక్కెళ్లి గ్రామ సచివాలయంలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments