Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ ఎన్నికల వేళ 'తలైవి' ప్రచారం వద్దు : ఈసీకి ఫిర్యాదు

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (12:35 IST)
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ ఇటీవలే జరిగింది. వచ్చే నెల 23వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అదేసమయంలో తమిళనాడు రాష్ట్ర శాసనసభకు వచ్చే నెల 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో తలైవి ప్రచార కార్యక్రమాలను నిలిపివేయాలని ఓ న్యాయవాది కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఓ ఫిర్యాదు చేశారు. 
 
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా, ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఈ కారణంగా 'తలైవి' సినిమాకి నిర్వహించాలనుకుంటున్న ప్రమోషన్స్‌ని ఆపాలని ప్రముఖ న్యాయవాది ఒకరు భారత ఎన్నికల కమిషన్‌కి పిటిషన్‌లో నివేదించారని తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు ఏదైనా ప్రచార సామగ్రిని ప్రదర్శించకూడదని.. అందుకే  ఆపాలని పిటిషన్‌లో వెల్లడించినట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా అప్‌లోడ్ చేసిన ప్రచార మెటీరియల్‌ని వీలైనంత త్వరగా తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు దర్శక, నిర్మాలను.. ప్రమోటర్స్‌ని ఆదేశించాలని న్యాయవాది కోరారట. అ
 
లాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈ సినిమాకి సంబంధించి రోడ్ షోలు లేదా ప్రచార కార్యక్రమాలను అనుమతించకూడదంటూ న్యాయవాది కోరారని తెలుస్తోంది. కాగా 'తలైవి' సినిమాని ఏప్రిల్ 23న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments