Webdunia - Bharat's app for daily news and videos

Install App

బచ్చన్ వారసురాలు ఆరాధ్య-అమీర్ కుమారుడు ఆజాద్‌తో రైల్ గాడీ పాటకు స్టెప్పులేస్తే?

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్, కోడలు ఐష్‌ల పుత్రిక ఆరాధ్య గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అలాగే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అయిన అమీర్ ఖాన్ కుమారుడు ఆజాద్‌రావ్‌ ఖాన్‌ గురించి కూడా పెద్దగా పరిచయం అక్క

Webdunia
సోమవారం, 9 జనవరి 2017 (15:52 IST)
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్, కోడలు ఐష్‌ల పుత్రిక ఆరాధ్య గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అలాగే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అయిన అమీర్ ఖాన్ కుమారుడు ఆజాద్‌రావ్‌ ఖాన్‌ గురించి కూడా పెద్దగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ యుక్త వయస్సు వచ్చాక కలిసి నటించాలని అమితాబ్ ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు. తప్పకుండా ఈ జంట వెండితెర స్క్రీన్‌పై మంచి పేరు కొట్టేస్తుందని కూడా అమితాబ్ జోస్యం చెప్పారు. 
 
కానీ అమితాబ్ ఆశ తీరిపోయింది. ఇప్పుడే ఆరాధ్య-ఆజాద్‌ల జంట కలిసింది. అదీ స్టేజ్ షో మీద. ఇంతకీ విషయం ఏమిటంటే? బాలీవుడ్‌ నటులు ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, అమీర్‌ ఖాన్‌ తదితరులు తమ పిల్లల పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బచ్చన్‌ వారసురాలు ఆరాధ్య, అమీర్‌ కుమారుడు ఆజాద్‌రావ్‌ ఖాన్‌.. ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. 
 
పాఠశాల వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరాధ్య, ఆజాద్‌ కలిసి 'రైల్‌ గాడీ' అనే పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ వేడుకలో తీసిన కొన్ని వీడియోలు ఫ్యాన్స్‌ క్లబ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అందులో వేదికపై పిల్లల ప్రదర్శన చూస్తున్న ఐశ్వర్య, అభిషేక్‌, అమీర్ ఖాన్ కరతాళ ధ్వనులతో ప్రోత్సహిస్తున్నారు. వీరితోపాటు పాఠశాల ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ కూడా ఉన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments