Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైంటిఫిక్ థ్రిల్లర్ ఎంతవారు గాని చిత్ర టీజర్ ను మెచ్చిన అడివి శేష్

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (22:34 IST)
Adavi sheshu, Sriniwaas.N, Surya Srinivas
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఎన్ శ్రీనివాసన్ ని దర్శకుడిగా పరిచయం చెస్తూ   రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఎంతవారు గాని' . సైంటిఫిక్  థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ని హిట్  చిత్రంతో సక్సెస్ అందుకున్న  హిట్ హీరో అడవి శేష్  విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియచేసారు. 
 
కేవలం ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు. ‘ఎంతవారుగాని’  సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని ఈ వీడియో ద్వారా వెల్లడించారు. యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ టీజర్ చూసిన అడవిశేష్ ఎంతో బాగా వచ్చిందని చెబుతూ చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
దర్శకుడు శ్రీనివాసన్. ఎన్ ని ‘నివాస్’ అనే పేరుతో తన 'రంగీలా' సినిమాతో ఎడిటర్ గా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత 'క్షణ క్షణం', 'గాయం', 'గోవిందా గోవిందా', 'రాత్రి', 'అంతం', 'ద్రోహి', 'మనీ', 'అనగనగ ఒక రోజు', 'మృగం', 'రాత్', 'మనీ మనీ' సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్ గా పని చేసి అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు 'ఎంతవారుగాని' అనే ఈ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించబోతున్నారు శ్రీనివాస్ ఎన్.
 
ప్రవీణ్ K బంగారి సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. JK మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments