ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

ఠాగూర్
ఆదివారం, 16 నవంబరు 2025 (16:53 IST)
తన ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారని అందువల్ల తన అభిమానులు మరింత జాగ్రత్తగా ఉండాలని సినీ హీరోయిన్ అదితి రావు హైదరీ విజ్ఞప్తి చేశారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోటోగ్రాఫర్లను సంప్రదిస్తూ ఫోటోషూట్‌ల గురించి మాట్లాడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. 
 
ఈ విషయంపై తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ ప్రకటన చేశారు. కొంతమంది నా దృష్టికి తెచ్చిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాట్సాప్‌‍లో ఎవరో నా ఫోటో పెట్టుకుని నేనే అన్నట్టుగా ఫోటోగ్రాఫర్లకు మెసేజ్‌లు చేస్తున్నారు. అది నేను కాదు. నేను వ్యక్తిగతంగా ఎవరినీ ఇలా సంప్రదించను. నా పనులన్నీ నా టీమ్ చూసుకుంటుంది అని స్పష్టం చేశారు. 
 
అలాగే, దయచేసి ఆ నంబరుతో ఎవరూ మాట్లాడొద్దు. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నా టీమ్‌కు తెలియజేయండి. నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అదితి తన పోస్టులో పేర్కొన్నారు. అభిమానులు, సహచరులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. అందువల్ల తన పేరుతో వచ్చే సందేశాలకూ ఏ ఒక్కరూ స్పందించవద్దని ఆమె తన అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

చాయ్‌వాలా దేశ ప్రధానమంత్రి ఎలా అయ్యారు? సీఎం చంద్రబాబు ప్రశ్న

'ఈ పూటకు వెళ్లొద్దు... ఇంట్లోనే ఉండిపో నాన్నా' అని చెప్పినా వినలేదు.. చివరకు శాశ్వతంగా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments