Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆదిపురుష్‌"కు యు సర్టిఫికేట్... రన్ టైమ్ ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (16:08 IST)
హీరో ప్రభాస్ - హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురువారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది., ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యుల బృందం "యు" సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. అలాగే, ఈ చిత్రం నిడివి కూడా 2 గుంటల 59 నిమిషాలు. 
 
టాలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలు ఇంతటి రన్‌టైమ్‌ (సుమారు 3 గం.)తో తెరకెక్కాయి. కంటెంట్‌ బాగుంటే సినిమా ఎన్ని గంటలున్నా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం.. నాటి 'దానవీర శూర కర్ణ' నుంచి గతేడాది వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' వరకు నిరూపితమైంది. 
 
రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రాముడిగా, హీరోయిన్‌ కృతిసనన్‌.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, హనుమంతుడిగా సన్నీసింగ్‌ నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్‌ 16న విడుదలకానుంది. 
 
ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల విక్రయంలో అటు చిత్ర బృందం, ఇటు ఈ సినిమాలో భాగస్వామి అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో ఓ సీటును హనుమంతుడికి కేటాయిస్తున్నట్టు టీమ్‌ ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10 వేలకుపైగా టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments