Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్ థ్రిల్లర్ కు శ్రీకారం చుట్టిన ఆది సాయికుమార్

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (19:04 IST)
Adi Saikumar, Shivshankar Dev
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా లకు డిమాండ్ పెరుగుతున్న ట్రెండ్ లో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో ఆది సాయికుమార్ హీరో గా  కొత్త సినిమా కు ముహూర్తం కుదిరింది. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి ప్రొడక్షన్ గా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9 : 45 కి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. శ్రీమతి సునీత సమర్పణలో, అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.
 
adi gun look
ఈ లుక్ బాగా  ఆకట్టుకుంటోంది. పోస్టర్ ను బట్టి ఇదొక ఇంటెన్స్ క్రైమ్  థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. సూట్ వేసుకున్న హీరో చేతిలో పిస్టల్ తో టార్గెట్ ఎయిమ్ చేశారు. మరి ఆ టార్గెట్ ఏంటో, ఎందుకో తెలియాలంటే సినిమాలో చూడాలి. ఈ సినిమా ఆది సాయి కుమార్ కు కొత్త ఇమేజ్ ని తెస్తుందనే భరోసా కలిగించింది. ఆది సాయికుమార్ ఇటీవల కొత్త తరహా చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆయన చేస్తున్న మరో డిఫరెంట్ అటెంప్ట్ గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. 
 
నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్న ఈ చిత్రానికి సంగీతం - అనీష్ సొలమన్, సినిమాటోగ్రఫీ - గంగనమోని శేఖర్, పీఆర్వో - జీఎస్కే మీడియా, సమర్పణ - శ్రీమతి సునీత, నిర్మాత - అజయ్ శ్రీనివాస్, దర్శకత్వం - శివశంకర్ దేవ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments