Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది సాయికుమార్ 'అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1'

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (16:12 IST)
Adi Saikumar
ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా 'అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1'. ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మాత ఎస్ వీ ఆర్ నిర్మిస్తున్నారు. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ నాయికగా నటిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు రాని కొత్త కథా నేపథ్యంతో 'అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' సినిమాను రూపొందిస్తున్నారు డెబ్యూ డైరెక్టర్ ఎస్ బాలవీర్. 
 
రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు రెడీ అయ్యింది 'అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' సినిమా.  'అమరన్‌ ఇన్‌ ది సిటీ-చాప్టర్‌ 1' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ ఖర్చుతో నిర్మించిన పోలీస్ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. దీంతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. ఆది సాయి కుమార్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండబోతోంది. 
 
సాయి కుమార్, ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర శంకర్, అయన్, శృతి, రోషన్, మధు మణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: ఎస్‌.బాల‌వీర్‌, నిర్మాత:  ఎస్‌వీఆర్‌, సమర్పణ: జెమిని.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ : లక్ష్మణ్ స్వామి, నాగ మధు, సంగీతం: కృష్ణ చైతన్య,  సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్ విష్ణు , లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్వేతా కటకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments