Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆది సాయి కుమార్ బ్లాక్ చిత్రం థియేట్రికల్ ట్రైలర్

Webdunia
శనివారం, 21 మే 2022 (18:46 IST)
Adi Sai Kumar, GB Krishna, Mahankali Divakar, Sai Kumar
మహంకాళి మూవీస్ పతాకంపై అది సాయి కుమార్ హీరో గా బిగ్ బాస్ ఫేమ్ కౌషల్ మండా ముఖ్యమైన పాత్రలో  జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం "బ్లాక్". ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను ఆది తండ్రిగారైన  సాయి కుమార్ గారు పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని మే నెల 28న విడుదల చేస్తున్నారు.
 
ఈ సందర్భంగా సాయి కుమార్ గారు మాట్లాడుతూ "ఇప్పుడే మీడియా మిత్రులతో పాటు థియేట్రికల్ ట్రైలర్ ని చూసాను, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. యూనిట్ సభ్యులందరికి నా శుభాకాంక్షలు. పూరి జగన్నాధ్ గారి దగ్గర పని చేసిన జి బి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే 28న విడుదల అవుతుంది. మే 28 చాలా గొప్ప రోజు, ఎన్  టి ఆర్ గారి పుట్టిన రోజు. అంత గొప్ప రోజు నా కొడుకు ఆది బ్లాక్ చిత్రం విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. ఆది కి ఏ చిత్రం మంచి విజయం సాధిస్తుంది. ట్రైలర్ మంచి కిక్ ఇచ్చింది. సినిమా కూడా విజయవంతం అవ్వాలి" అని కోరుకున్నారు.
 
నటుడు మధునందన్ మాట్లాడుతూ "ఆది అంటే మా ఫామిలీ మనిషి, అది కి మంచి విజయం రావాలి అని కోరుకుంటున్నాను. దర్శకుడు కృష్ణ చాలా కష్టపడ్డాడు, ఈ చిత్రం అందరికీ మంచి విజయం సాధిస్తుంది. మే 28న విడుదల అవుతుంది. అందరూ తప్పక చూడండి" అని తెలిపారు.
 
బిగ్ బాస్ ఫేమ్ కౌషల్ మండా మాట్లాడుతూ "బిగ్ బాస్ తర్వాత మంచి చిత్రం కోసం వేచి చూశాను. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణ నాకు ఈ కథ చెప్పారు. నాకు బాగా నచ్చింది.నా రియల్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆది గారితో పని చేయడం మంచి అనుభవం. మా ఇద్దరి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆది గారి కెరీర్ లో చాలా డిఫరెంట్ సినిమా గా ఉంటుంది. మే 28న విడుదల అవుతుంది, అందరూ చూడండి" అని తెలిపారు.
 
దర్శకుడు  జి బి కృష్ణ మాట్లాడుతూ "ఇది చాలా డిఫరెంట్ కథ, ఆది గారి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసాము, ట్రైలర్ ఎంత బాగుందో సినిమా కూడా అంతే బాగుంటుంది. అందరికి నచ్చుతుంది. ఈ చిత్రం లో ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా హైలైట్ గా ఉంటుంది. స్టార్స్ ఉన్న చిత్రం కాదు కానీ స్టార్ కంటెంట్ ఉన్న సినిమా. మా చిత్రాన్ని అందరూ ఆదరిస్తారు" అని కోరుకున్నారు.
 
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ "మా బ్లాక్ చిత్రం మే 28న విడుదల అవుతుంది. మే చివరి వారం సినిమా ప్రేక్షకులకి ఒక పండగ, మే 27న వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు నటించిన ఎఫ్ 3 సినిమా విడుదల అవుతుంది, మే 28న మా బ్లాక్ చిత్రం విడుదల అవుతుంది. ఈ రెండు చిత్రాలు లు గవర్నమెంట్ నిర్ణయించిన టికెట్ రేట్లకే చూడొచ్చు. మా మహంకాళి బ్యానర్ పై నిర్మించిన బ్లాక్ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది, అందరు ఫోన్ చేసి చాలా బాగుంది అని చెప్తున్నారు, మా చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది" అని కోరుకున్నారు.
 
హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ "నాకు  కథ విన్న వెంటనే బాగా నచ్చింది. డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు, డైరెక్టర్ కి చాలా క్లారిటీ ఉంది, ట్రైలర్ చాలా బాగా వచ్చింది, అందరూ మెసేజ్ చేస్తున్నారు ట్రైలర్ చాలా బాగుంది అని,  సినిమా కూడా చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కోవిద్ టీం లో మేము చాలా కష్టపడి షూటింగ్ చేశాం. మే 28న విడుదల అవుతుంది, అందరూ బాగా నచ్చుతుంది" అని తెలిపారు.
ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో  నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments