Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 22న ఆది సాయి కుమార్ బ్లాక్‌ విడుదల

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (17:42 IST)
Black movie
మహంకాళి మూవీస్ పతాకంపై అది సాయి కుమార్ హీరోగా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం "బ్లాక్". ఈ చిత్రంలో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. తన కెరీర్‌లో బ్లాక్ చిత్రం ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది. ఇటీవల విడుదల అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు జి బి కృష్ణ మాట్లాడుతూ "బ్లాక్ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఆది నటన, కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. మా నిర్మాత మహంకాళి దివాకర్ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్‌ను విడుదల చేసి ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తాం" అని తెలిపారు.
 
నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ "మా బ్లాక్ చిత్రం ఏప్రిల్ 22న విడుదల అవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. మంచి కథ, కథనం తో చిత్రాన్ని నిర్మించాము. మా దర్శకుడు జి బి కృష్ణ మంచి చిత్రాన్ని అందించాడు. సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఉంది" అని తెలిపారు.
ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో  నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ : అమర్ రెడ్డి
ఫైట్స్ : రామకృష్ణ, ఆర్ట్ : కె వి రమణ, పి ఆర్ ఓ : పాల్ పవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శంకర్, 
నిర్మాత : మహంకాళి దివాకర్, రచన - దర్శకత్వం : జి బి  కృష్ణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments