Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ కి పవర్ ఫుల్ ప్రతినాయకునిగా ఆది పినిశెట్టి

Webdunia
సోమవారం, 19 జులై 2021 (13:27 IST)
Adi Pinishetti
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. 'RAPO19' అనేది వర్కింగ్ టైటిల్. ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 12న హైదరాబాద్‌లో సినిమా చిత్రీకరణ మొదలైంది. ప్రేక్షకులలో సినిమాపై అంచనాలు నెలకొనేలా చేయడంలో విజయవంతమైన దర్శక నిర్మాతలు, ఇప్పుడు రామ్ పోతినేనిని ఢీ కొట్టే  ప్రతినాయకుడిగా ఆది పినిశెట్టిని ఎంపిక చేశారు.
 
'సరైనోడు' సినిమాలో సూపర్ స్టయిలిష్ విలన్‌గా ఆది పినిశెట్టి అద్భుతంగా నటించారు. 'రంగస్థలం', 'నిన్నుకోరి', 'యు-టర్న్' సినిమాల్లో ఆయన మంచి పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి హీరోగా నటించిన రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో బైలింగ్వల్ సినిమా షూటింగ్ ప్రారంభించారు. రెగ్యులర్ పాత్రల్లో నటించడం తనకు ఆసక్తి ఉండని ఆది పినిశెట్టి ఎప్పుడూ చెబుతుంటారు. ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.
 
రామ్ పోతినేని మాస్ ఎంటర్టైనర్ 'RAPO19'లో విలన్ క్యారెక్టర్ యూనిక్ గా ఉండటంతో పాటు క్యారెక్టరైజేషన్ నచ్చడంతో, ఆ పాత్రలో నటించడానికి ఆది పినిశెట్టి అంగీకరించారు. హీరోనా, విలనా, సపోర్టింగ్ క్యారెక్టరా అని చూడకుండా మంచి పాత్రల్లో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా సరే ఆ అవకాశాలను ఆది పినిశెట్టి వదిలిపెట్టలేదు. ఊర మాస్ ఎంటర్ టైనర్ సినిమాగా తెరకెక్కుతున్న RAPO19లో రామ్, ఆది పినిశెట్టి మధ్య సన్నివేశాలు నువ్వా - నేనా అన్నట్టు ఉండబోతున్నాయి.
 
చిత్రనిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ, రామ్ ఫుల్ ఎనర్జీతో షూటింగ్ చేస్తున్నారు. ఆయనను ఢీ కొట్టే విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించనున్నారు. హీరో, విలన్ మధ్య యాక్షన్ సీన్లు నువ్వా - నేనా అనే రేంజ్‌లో ఉంటాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్, టాప్ టెక్నీషియన్లతో సినిమా తెరకెక్కిస్తున్నాం. భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

భర్తను రోడ్డు మీదికి ఈడ్చేలా మహిళల ప్రవర్తన ఉండరాదు : సుప్రీంకోర్టు

Snake: గురుకులం పాఠశాలలో పాము కాటు ఘటనలు.. ఖాళీ చేస్తోన్న విద్యార్థులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments