Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోఫా (కౌచ్)లో కూర్చోవాలని అనుకోలేదు : క్యాస్టింగ్ కౌచ్‌పై ఆదా శర్మ

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (09:14 IST)
చిత్రపరిశ్రమలో ఇపుడు క్యాస్టింగ్ కౌచ్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్రపరిశ్రమలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ అంశంపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదిక అనేక సంచలన విషయాలను బహిర్గతం చేసింది. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పలువురు హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఆదా శర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆమె తాజాగా ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందా అని ప్రశ్నించగా, తాను నేలమీదే కూర్చొన్నాను... సోఫా (కౌచ్)లో కూర్చోవాలని అనుకోలేదు అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. 
 
'మనం సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తామో.. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించాలని చూస్తే అంతే వేగంగా కనిపెట్టాలి. ఆ సమయంలో మనం ఏం చేయాలనేదానిపైనే దృష్టి పెట్టాలి. పక్కవారి అభిప్రాయాలను తీసుకోకూడదు. ఏ రంగంలోనైనా సపోర్ట్‌ నెట్‌వర్క్‌ కలిగి ఉండడం ముఖ్యం. నాకు మద్దతు ఇచ్చేవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నందుకు సంతోషిస్తున్నాను' అని వివరించారు. 2008 నుంచి ప్రారంభమైన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నట్లు అదా వివరించారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments