''సోనూ కే టిటు కి స్వీటీ'' సినిమాలోని "బామ్ డిగ్గీ డిగ్గీ'' అంటూ సాగే పాటకు అందాల ఆదా శర్మ స్టెప్పులేసింది. ఆదా శర్మ మాత్రమే కాకుండా ఆమె బామ్మ కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం
''సోనూ కే టిటు కి స్వీటీ'' సినిమాలోని "బామ్ డిగ్గీ డిగ్గీ'' అంటూ సాగే పాటకు అందాల ఆదా శర్మ స్టెప్పులేసింది. ఆదా శర్మ మాత్రమే కాకుండా ఆమె బామ్మ కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ''హార్ట్ ఎటాక్'' సినిమాతో యూత్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.
కానీ ఆపై ఆదా శర్మకు ఆశించినంత అవకాశాలు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంది. ఇంకా చేతికందిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటున్న ఈమె తాజాగా అమ్మమ్మతో కలిసి స్టెప్పులు వేసింది. ఇప్పటివరకు ఈ వీడియోకి 1,314,718 పైగా వ్యూస్ నమోదయ్యాయి. ఇక షేర్లు, లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.