Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న 'వానపాటల' హీరోయిన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆర్జీవీపై ఆమె అంతలా కోపం పెంచుకోవడానికి కారణమేంట

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (16:22 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆర్జీవీపై ఆమె అంతలా కోపం పెంచుకోవడానికి కారణమేంటనే కదా మీ సందేహం. 
 
ఆర్జీవీ తెరకెక్కించనున్న 'లక్షీస్ ఎన్టీఆర్' సినిమాపై ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం చెలరేగింది. ఇప్పటివరకు వర్మపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా... తాజాగా, టీడీపీలో చేరుతానని ప్రకటించిన సినీ నటి వాణీ విశ్వనాథ్ కూడా ఆ జాబితాలో చేరారు. 
 
ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే, చూస్తూ ఊరుకోబోమని... ఇలాంటి సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే ఆపేయాలని అన్నారు. లేనిపక్షంలో వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్‌లో రాముడిని, కృష్ణుడిని ప్రజలు చూసుకున్నారని అన్నారు.
 
ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే... ఇలాంటి సినిమాను తీయడానికి వర్మ ప్రయత్నిస్తుండటం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాకు వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని వాణీ విశ్వనాథ్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments